YS Vijayalakshmi: వైఎస్ విజయలక్ష్మి.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

YS Vijayalakshmi: వైఎస్ విజయలక్ష్మి.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
X
YS Vijayalakshmi: వైఎస్‌ కుటుంబానికి అధికారమే పరమావధా? ఏపీలో అధికారంలోకి వస్తే చాలా? అక్కడ ప్రజల సమస్యలు పట్టవా?

YS.Vijayalakshmi: వైఎస్‌ కుటుంబానికి అధికారమే పరమావధా? ఏపీలో అధికారంలోకి వస్తే చాలా? అక్కడ ప్రజల సమస్యలు పట్టవా? తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్ సమయంలో తల్లి విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌తోనూ, జగన్ మోహన్ రెడ్డితో.. తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. విజయలక్ష్మి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు ఏపీ ప్రజలు. ఏపీలో అధికారం దక్కిన తర్వాత….అక్కడ అంతా బాగానే ఉందంటూ.... ఆ రాష్ట్రాన్ని గాలికి వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


చెప్పిన హామీలను, ఇచ్చిన మాటలను తుంగలో తొక్కారంటూ ఫైర్‌ అవుతున్నారు. మూడేళ్లుగా… ఏపీకి రాజధాని లేదు. జగన్‌ సర్కారు ఇబ్బడి ముబ్బడికి అప్పులు చేస్తోంది. ఇసుక ధరలు కొండెక్కాయి. మద్య నిషేదం చేస్తానన్న హామీ ఊసే లేదు. పైగా సొంత డిస్టలరీలతో.. జనానికి విషం తాగిస్తున్నారు.


ఇన్ని సమస్యలు ఉన్నా .... విజయలక్ష్మికి పట్టదా? మరి ఎన్నికల్లో.... ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని ఎందుకడిగారు? ఇప్పుడు ఆ రాష్ట్రంతో ఎందుకు సంబంధం లేదంటున్నారు.? ఇదే ఇప్పుడు ఏపీ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు!...ఇంతకి.. విజయలక్ష్మి అప్పుడేమన్నారు? ఇప్పుడేమంటున్నారో ఓ సారి చూద్దాం...


జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనను ముఖ్యమంత్రిగా చేయడం కోసం వైయస్ విజయలక్ష్మి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ క్రమంలో జగన్ వల్లే రాజన్న రాజ్యం సాధ్యం అంటూ జనాన్ని మభ్యపెట్టారు. తన బిడ్డకు ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ జనంలోకి వెళ్లి మరీ ఓట్లు అడిగారు.. జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కే వరకు.. ఎంత చేయాలో అంతా విజయమ్మ చేశారు.


కానీ ఆయన అందలం ఎక్కిన తర్వాత జగన్.. తల్లిని, చెల్లిని దూరంగా పెట్టడంతో.... ఇప్పుడు తమకేమి సంబంధం లేదంటున్నారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ పేరుతో పార్టీ.... అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారనే సాక్షాత్తు టీఆర్‌ఎస్‌ నేతలే విమర్శిస్తున్నారు.


తెలంగాణకు కాందిశీకుల్లా మారిన విజయలక్ష్మి, షర్మిల... ఏపీలో జగన్‌ అధికారంలో వచ్చాక... సొంత రాష్ట్రానికి వెళ్లడం మానేశారు. గతంలో ఏపీలో జగన్‌ను గద్దెనెక్కించడానికి అంతగా పాటుపడిన విజయమ్మకు ఇఫ్పుడు ఏపీ ప్రజలు సమస్యలతో సతమతమౌతుంటే పట్టదా అని నిలదీస్తున్నారు.

ఇక. షర్మిల పరిస్థితి ఇదే తీరుగా ఉంది. సోదరుడు జగన్ కోసం జగనన్న వదిలిన బాణాన్నంటూ పాదయాత్ర చేశారు. జగన్ అధికార పీఠం ఎక్కిన తర్వాత.. రాజధాని అమరావతి నుంచి నిన్న మొన్నటి ఆక్వా రైతుల సమస్యల వరకు ఒక్క సమస్యపైనా స్పందించలేదు.


అటు విజయలక్ష్మి కానీ, ఇటు షర్మిల కానీ...... ఏపీ ప్రజలకు అండగా నిలిచింది లేదు. మూడు రాజధానులు సహా జగన్ నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేకంగానే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. కానీ వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ ప్రజల వద్దకు వచ్చి చేతులు జోడించి మరీ వేడుకున్న విజయమ్మకు.. ఇప్పడు ఏపీ సమస్యలు పట్టవా? ఏపీతో సంబంధం లేదా అని ప్రశ్నిస్తున్నారు. మాట తప్పం.. మడం తిప్పం అంటూ జగన్ ఇచ్చిన హామీలూ, వాగ్దానాలు ఇంత వరకూ అమలు కాలేదనీ, వాటి గురించి మీ కుమారుడిని నిలదీయాల్సిన బాధ్యత నాడు జగన్ ను గెలిపించాలని కోరిన మీకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో జగన్‌ కోసం... షర్మిల ఎలా ప్రచారం చేశారో చూసి... ఆమెను నమ్మి ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు ఏపీ ప్రజలు..

తెలంగాణలో ప్రస్తుతం..వైయస్ షర్మిల పడుతోన్న ఇబ్బందులే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష టీడీపీ నేతలు సైతం గత మూడున్నరేళ్లగా పడ్డుతున్నారంటున్నారు. మరీ ఈ అంశంలో విజయలక్ష్మి స్పందించి ఉంటే.. నేడు ఈ పరిస్థితి మీ దాకా వచ్చేది కాదని వారు చురకలంటిస్తున్నారు. ఏదీ ఏమైనా నాడు రాజన్న రాజ్యం తీసుకు వస్తాడు నా బిడ్డ అంటూ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రచారానికి దిగి ప్రచారం చేశారని..వారి మాటలు నమ్మి..ప్రజలు ఓట్లు గంప గుత్తగా వేశారని... కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అందరూ చూస్తూ.. ఇదేం ఖర్మ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు విపక్ష నేతలు.

Tags

Next Story