Telangana Lockdown : ఫుడ్ డెలివరీ బాయ్స్ వాహనాల నిలుపుదల..!

Telangana Lockdown : ఫుడ్ డెలివరీ బాయ్స్ వాహనాల నిలుపుదల..!
X
Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపధ్యంలో హైదరాబాద్ లో జొమాటో, స్విగ్స్ డెలివరీ బాయ్ వాహనాలను పోలీసులు ఆపేస్తున్నారు.

Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపధ్యంలో హైదరాబాద్ లో జొమాటో, స్విగ్స్ డెలివరీ బాయ్ వాహనాలను పోలీసులు ఆపేస్తున్నారు. అయితే నిన్నటి వరకు అనుమతి ఇచ్చిన పోలీసులు.. నేటినుంచి కఠిన ఆంక్షల నేపథ్యంలో వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. తమకు ముందస్తు సమాచారం ఇస్తే రోడ్డుపైకి వచ్చేవాళ్ళమే కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్డర్ లేకుండా వెళ్తున్న ఫుడ్ డెలివరీ వాహనాలను మాత్రమే సీజ్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అటు లాక్ డౌన్ ను నగరంలో, జిల్లాలలో కఠినంగా నిర్వహిస్తున్నారు పోలీసులు.. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నాటికి సుమారు 15 వేల వాహనాలను జప్తుచేసినట్లుగా సమాచారం.

Tags

Next Story