బీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ పోరు..!

బీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ పోరు..!
ఇప్పటికే అన్ని ఉమ్మడి జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య టిక్కెట్ వార్ నడుస్తోంది

అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ పోరుపై గులాబీ బాస్‌ రివర్స్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారా... అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే అన్ని ఉమ్మడి జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య టిక్కెట్ వార్ నడుస్తోంది. ఒక్కో నియోజక వర్గంలో ఇద్దరు నుండి నలుగురు టిక్కెట్ ఆశిస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల్లో దాదాపు 20 మందికి పైగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రేసులో వున్నారు. ఇక ఇటీవల పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లోను నేతల మధ్య వర్గపోరు బయటపడింది.ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న నేతలు కొంతమంది గులాబీ అధినేత కేసీఆర్ ద్వారా టిక్కెట్ ప్రయత్నాలు చేస్తుండగా మరికొంతమంది నేతలు కేటీఆర్ తో తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే పార్టీలో నెలకొన్న వర్గపొరుపై కేసీఆర్ సైలెంట్ గా వున్నారు. సైలెంట్ వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు పార్టీలో సీనియర్లు. ఇప్పటి వరకు పార్టీపై, ప్రభుత్వం పైన బహిరంగగానే విమర్శలు చేసిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు వేశారు తప్ప వారి వెంట వున్న అనుచరులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.పొంగులేటి వెంట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపైన వేటు వేయలేదు.ఈ విషయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాధ్ రెడ్డి..మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఆయన పార్టీలో మళ్లీ యాక్టివ్ అయ్యారు.

మరోవైపు కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో బీఆర్ఎస్ టిక్కెట్ కోసం పోటీ పడుతున్న నేతలకు ఆ నియోజకవర్గంలో ఎంత పట్టు వుంది,ఎవరికి టిక్కెట్ ఇస్తే గెలిచే అవకాశం వుందనే అంశాలను సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల నివేదికలు వచ్చిన తరువాతే అభ్యర్ధిని డిసైడ్‌ చేయనున్నారు. ఆ తరువాతే ఆధిపత్య పోరుపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముందు గానే వర్గపొరుపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటే వారు పార్టీ అవకాశాలు ఉండటంతో కేసీఆర్‌ వ్యూహాత్మకంగానే సైలెంట్‌ ఉన్నట్లు సమాచారం.టైం చూసి కేసీఅర్ అసలు స్ట్రాటజీ ప్లే చేయనున్నట్టు పార్టీ లో టాక్ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story