కొత్త రోల్ లో బుల్లితెర నటి అస్మిత; స్వీయ నిర్మాణంలో పెద్ద ప్రయోగం

హైదరాబాద్
కొత్త రోల్ లో బుల్లితెర నటి అస్మిత; స్వీయ నిర్మాణంలో పెద్ద ప్రయోగం
బుల్లితెర నటి, ప్రముఖ యూట్యూబర్ అస్మిత తాజాగా వెబ్ సిరీస్ తో అలరించేందుకు సిద్ధమవుతోంది. స్వీయనిర్మాణంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతంది.

హైదరాబాద్ :

తెలుగు బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటి అస్మిత ఓ వైపు సినిమాల్లోనూ తళుక్కుమంటూ, మరోవైపు యూట్యూబర్ గానూ రాణిస్తోంది. యాష్ ట్రిక్స్ పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అస్మిత మోటివేషనల్ వీడియోలతో పాటూ, మేకప్ కిట్ ల తయారీలోనూ తర్ఫీదు ఇస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా మరో అడుగు ముందుకు వేయాలని సంకల్పించుకున్న అస్మిత వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తోంది.

భర్త సుధీర్ సహకారంతో 'ఏ1 ఫ్రమ్ డే1' అనే వెబ్ సిరీస్ ను రూపొందించింది అస్మిత. త్వరలోనే ఈ సిరీస్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ కు సిద్ధమవ్వబోతోంది. భార్యాభర్తల ముధ్య చిలిపి తగాదాలు, అచ్చట్లు ముచ్చట్లే ఇతివృత్తంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ సిరీస్ లో కీలక పాత్ర పోషించబోతున్నారు. డిసెంబర్ 10 సాయంత్రం నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రిఫ్యూ షో కు మంచి రెస్పాన్స్ లభించిందని అస్మిత తెలిపింది. ఎవరో అవకాశం ఇస్తారని ఎదురు చూడటం కన్నా, మన అవకాశాలను మనమే సృష్టించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టినట్లు పేర్కొంది. ఏమైనా బుల్లితెర నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన అస్మిత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తనని తాను మలచుకుంటోన్న తీరు ఎందరికో ఆదర్శమనే చెప్పాలి. మరి 'ఏ1 ఫ్రమ్ డే1' ఆమె కెరీర్ కు మరింత ముందుకు నడిపిస్తుందేమో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story