'పులి మేక' గ్లింప్స్ రిలీజ్ చేసిన రకుల్

మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా జీ 5 పన్నెండు భాషల్లో ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్ కంటెంట్‌ను అందిస్తోంది. ఇప్పటికే క్రేజీ సినిమాలు, ఒరిజినల్స్, టాక్ షోస్ అంటూ రకరకాల ప్రోగ్రామ్స్‌ను అందిస్తూ తనదైన మార్క్ వేసుకుటోంది. సిల్వర్ స్క్రీన్‌పై ఆడియెన్స్‌ని అలరించిన లావణ్య త్రిపాఠి తాజాగా కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, జీ 5 కాంబోలో రూపొందిన 'పులి మేక' ఒరిజినల్‌తో ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఆమెతో పాటు ఆది సాయికుమార్, సిరి హన్మంత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ఫిబ్రవరి 24 నుంచి ఈ ఒరిజినల్ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్‌గా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ 'పులి మేక' టీజర్‌ను విడుదల చేయగా అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ జోష్ తగ్గక ముందే మహా శివరాత్రి సందర్భంగా లావణ్య పాత్రలోని హీరోయిక్ యాంగిల్‌ను ఎలివేట్ చేసే స్పెషల్ గ్లింప్స్‌ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శనివారం రిలీజ్ చేసింది. 'పులి మేక' గ్లింప్స్‌ను గమనిస్తే అందులో లావణ్య ముఖమంతా పసుపు పుసుకుని అమ్మోరులాంటి వేషదారణలో కనిపిస్తుంది. ఇందులో లావణ్య త్రిపాఠి కిరణ ప్రభ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది. ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే లావణ్య ఈ పాత్ర కోసం వర్కౌట్ బాగానే చేసినట్లు కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com