ఆహా, అమెజాన్‌లో 'లక్కీ లక్ష్మణ్'

బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'లక్కీ లక్ష్మణ్'. డిసెంబర్ 30న సినిమా థియేటర్స్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్, ఆహాల్లో మహా శివ రాత్రి సందర్భంగా స్ట్రీమింగ్ అవుతోంది.
దిగువ మధ్య తరగతి కుటుంబ నేపథ్యంతో సాధారణ తండ్రి, కొడుకుల మధ్య జరిగే సంఘటలు, ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేక వారిద్దరి మధ్య జరిగే తగువులను, ఇంజనీరింగ్ చదివే కుర్రోడి ప్రేమను తెలుపుతూ సాగే సినిమా లక్కీ లక్ష్మణ్. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ జర్నీని ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు. కాబట్టి లక్కీ లక్ష్మణ్ చిత్రాన్ని ఈ శివరాత్రికి మీ అభిమాన అమెజాన్ ప్రైమ్, ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com