"రాజ్ కహాని" ట్రైలర్‌ విడుదల చేసిన మంత్రి తలసాని

రాజ్ కహాని ట్రైలర్‌ విడుదల చేసిన మంత్రి తలసాని
రాజ్ కార్తికేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రాజ్ కహాని"

భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మాతలు గా రాజ్ కార్తికేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రాజ్ కహాని". ఈ సినిమాకు సంగీతం స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందిచగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిచారు. కాగా రాజ్ కహానిలో చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి ముఖ్యపాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీ మార్చి 24న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. అయితే సినిమా యూనిట్‌ ప్రమోషన్లు బాగానే చేస్తుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేతుల మీదుగా లాంచ్‌ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు వైవీఎస్ చౌదరి, నిర్మాత సురేష్ కొండేటి ముఖ్య అతిథులుగా వచ్చి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story