ఏడిద శ్రీరాం, ఏడిద రాజా లకు కే.విశ్వనాథ్ స్మారక అవార్డ్

శ్రీ శోభ్ క్రుత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్, వంశీ కల‌్చరల్ ,ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆద్వర్యంలో ఉగాది వేడుకలు హైదరాబాద్ త్యగరాయ గాన సభలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కే.వి.రమణాచారి, ప్రముఖ రచయత యండమూరి వీరేంద్రనాద్‍లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి , దాదాసాహెబ్ పాల్కె అవర్ద్ గ్రహీత కే.విశ్వనాథ్ స్మారక అవార్డును పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరావు కమారులు ఏడిద శ్రీరాం, ఏడిద రాజా లకు బహుకరించారు . అనంతరం వారు మాట్లాడుతూ కే.విశ్వనాథ్ తో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకొని తమ సంతోషాన్ని వ్వక్తపరిచారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com