'ప్రేమ విమానం' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రేమ విమానం అనే వెబ్ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను తాజాగా సినిమా యూనిట్ విడుదల చేశారు. నిర్మాత అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ సినిమాకు సంతోష్ కటా దర్శకత్వం వహించగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అన్ని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఇద్దరు పిల్లలు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ శాన్వీ మేఘన, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్‌లు పోస్టర్‌లో కనిపిస్తున్నారు.
కథ విషయానికి వస్తే ఎలాగైనా సరే విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు, అర్జెంట్‌గా ఫ్లైట్ ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రేమ జంట ఇలా అందరినీ ఒకే చోటకు చేర్చుతుంది కథ. ఇక వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని చిత్ర బృందం వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com