పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా ఓజీ కోసం యువ దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జత కట్టారు. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ తాజాగా ఏప్రిల్ 15 న ముంబైలో ప్రారంభమైంది. కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఈ వారం ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన మరో అప్‌డేట్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్.
'డాక్టర్', 'డాన్', 'గ్యాంగ్ లీడర్', 'శ్రీకారం' వంటి చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ ఈ సినిమాలో పవన్ సరసన మెరవబోతున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు తనదైన మార్క్ వేస్తూ ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పుడు పవర్‌స్టార్ పక్కన నటిస్తుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. దీంతో ఓజీ కోసం ఎప్పుడెప్పుడా అని సినీప్రియులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంగీతం థమన్ అందిస్తుండటంతో ఆర్‌ఆర్, మ్యూజిక్, బ్యగ్‌రౌండ్ స్కోర్‌తో అల్లాడిస్తాడని అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు సుజీత్ ఎక్కడా రాజీపడకుండా అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని అందించడానికి కృషి చేస్తున్నాడు. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com