సస్పెన్స్ థ్రిల్లర్ 'హీట్' ట్రైలర్ విడుదల

మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ బాగానే ఉంటుంది. అలాంటి చిత్రాలను ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతుంటారు. అయితే అలాంటి కోవలోనే 'హీట్' అనే సినిమా రాబోతోంది. వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఎం.ఆర్.వర్మ సమర్పణలో ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్లపై ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవలె విడుదల చేశారు.
అయితే మే 5న విడుదల కాబోతోన్న 'హీట్' నుంచి తాజాగా సినిమా యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ఫ్రెండ్ అంటే వెలుతురున్నప్పుడు షాడో లాంటి వాడు కాదు.. చీకట్లో కూడా వెలుతురునిచ్చే వాడే నిజమైన ఫ్రెండ్' అంటూ సాగే డైలాగ్‌తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. చేజింగ్ సీన్లు, మర్డర్ సీన్లతో ట్రైలర్ ఉరుకులు పరుగులు పెట్టినట్టు అనిపిస్తోంది. ట్రైలర్ మధ్యలో వచ్చిన.. 'మనకి అర్హత లేని వాటిని టచ్ చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి'.. 'ఆటలో ఆడాలంటే..ఆడటం మాత్రమే తెలిస్తే చాలదు.. ప్రత్యర్థిని సరిగ్గా అంచనా వేయగలిగిన వాడు.. ప్రెజర్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయగలిగిన వాడు మాత్రమే గెలుస్తాడు'.. 'మైండ్ ఈజ్ డేంజరస్ వెపన్'.. 'ఎమోషన్ ఈజ్ ఏ మోస్ట్ డేంజరస్ వెపన్'.. అంటూ వచ్చిన డైలాగ్స్ ఆకట్టుకునేట్టు ఉన్నాయి. మెత్తానికి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుందో చూడాలంటే మే 5 వరకు ఎదురు చూడాల్సిందే..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com