శ్రీలీల అందాల 'చిత్రం'
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన నటుడు వైష్ణవ్‌తేజ్ ఉప్పెన సినిమాతో తన సినీ కెరీర్‌ను గట్టిగానే మొదలు పెట్టాడు. ఆ సినిమాతో వైష్ణవ్‌కు మంచి పేరే వచ్చింది. ఆ తరువాత వచ్చిన కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు ఫ్లాప్‌లుగా మిలిగాయి. అయితే తాజాగా ఈ యువ హీరో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పక్కా మాస్ లుక్‌లో మెరవబోతున్నాడు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లో వైష్ణవ్ నాలుగో చిత్రం తెరకెక్కుతుంది.
అయితే ఈ సినిమా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోంది. ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన హైపర్‌గర్ల్ శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పనులు దాదాపు పూర్తి అయినట్లు మేకర్స్ చెప్పేస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల చిత్ర అనే అమ్మాయిగా నటిస్తొంది. ఆ పాత్రకు సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్‌ను కూడా ఈరోజు మేకర్స్ విడుదల చేయనున్నారు. కాగా మాస్‌రాజా రవితేజ సరసన ధమాకాలో దుమ్ము దులిసి మాంచి ఫామ్‌లో ఉన్న ముద్దుగుమ్మ ఈ సినిమాలో ఏ విధంగా చెలరేగిపోతోందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com