స్వచ్ఛమైన తెలంగాణ పల్లె కథ.. "తురమ్ ఖాన్ లు"

స్వచ్ఛమైన తెలంగాణ పల్లె కథ.. తురమ్ ఖాన్ లు
తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం పల్లె కథలు ప్రాంతీయ అస్తిత్వ కథలను తెలుగు ప్రక్షకులు ఆదరిస్తున్నారు.ఇదే తరహా తెలంగాణ పల్లె కథతో వస్తున్న సినిమా తురుమ్ ఖాన్‌లు

తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం పల్లె కథలు ప్రాంతీయ అస్తిత్వ కథలను తెలుగు ప్రక్షకులు ఆదరిస్తున్నారు.ఇదే తరహా తెలంగాణ పల్లె కథతో వస్తున్న సినిమా తురుమ్ ఖాన్‌లు. "స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ" బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శంషాబాద్ లో జరిగిన ఆఖరి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకుంది. పల్లెటూరు రివెంజ్ కామెడీ జానర్‌లో మొదటి సారి పాలమూరు యాసలో తెరకెక్కెక్కించినట్లు మేకర్స్‌ తెలుపుతున్నారు.

అయితే ఈ సినిమాలో దాదాపు అందరూ నూతన నటీనటులే నటించారు. నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, పులి సీత, విజయ, శ్రీయాంక ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.12 ఏళ్లుగా తెలుగులో ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా పనిచేసిన శివకల్యాణ్‌ తొలిసారిగా దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్‌ మాట్లాడుతూ.. బలమైన కథ, సహజమైన పాత్రలు ఉన్న ఈ చిత్రాన్ని క్వాలిటీగా రూపొందించడానికి ఎక్కడా, ఏ మాత్రం తగ్గలేదన్నారు. ఈ సినిమాని ప్రేక్షకులకు అందించడానికి భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నామన్నారు.ఇప్పుడు ఇది చిన్న సినిమాగా విడుదల అవుతుందని కానీ ప్రేక్షకులకు చేరువైన తర్వాత వారే దీన్ని పెద్ద సినిమా చేస్తారనే నమ్మకం ఉన్నట్లు నిర్మాత చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story