Tollywood : ఘనంగా ప్రారంభమైన 'అజాగ్రత్త'

Tollywood : ఘనంగా ప్రారంభమైన అజాగ్రత్త

పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కు నార్త్‌లో ఎంత పేరు వచ్చిందో.. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్ తల్పడేకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ అయిన శ్రేయాస్ తల్పడే కామెడీ, సీరియస్ రోల్స్‌లో తన నటనతో అందరినీ మెప్పించారు. 'అజాగ్రత్త' సినిమాతో శ్రేయాస్ తల్పడే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. రాధిక కుమారస్వామి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎం శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి రాజ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నేడు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం క్లాప్ కొట్టగా..నిర్మాత ఠాగూర్ మధు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తోన్న ఈ అజాగ్రత్త సినిమాలో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు. రావు రమేష్‌, సునీల్, ఆదిత్య మీనన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సందీప్ వల్లూరి సినిమాటోగ్రఫర్‌గా, శ్రీహరి సంగీత దర్శకుడిగా, రవి వర్మ ఫైట్ మాస్టర్‌గా వ్యవహరించనున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాత రవి రాజ్ మాట్లాడుతూ.. 'అన్ని భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. అందరూ మా సినిమాను ఆశీర్వదించండి' అని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story