'రూల్స్ రంజన్' నుంచి మొదటి లిరికల్ వీడియో

ఇండస్ట్రీలో ఎటువంటి బాగ్రౌండ్ లేకపోయినా ప్రతిభ ఉంటే చాలు సక్సెస్ అవుతామని తాజాగా నిరూపించిన యువ నటుడు కిరణ్ అబ్బవరం. వరుస చిత్రాలతో తనదైన రీతిలో తెలుగు ప్రేక్షకులకు దెగ్గారయ్యాడు. తన నటనతో మరో సారి ప్రేక్షకులను అలరించడానికి నేహాశెట్టితో జతకట్టి 'రూల్స్ రంజన్' అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు.
అయితే ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందనే లభించింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాట విడుదలైంది. 'నాలో నేనే లేను' లిరికల్ వీడియోని సోమవారం ఉదయం చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు రాంబాబు గోసాల సాహిత్యం అందించగా అమ్రిష్ గణేష్ సంగీత దర్శకుడు. తన ప్రేమను కథానాయకకి చెప్పడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చూపించారు. కళ్లద్దాలు, నుదుటున బొట్టుతో బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నాడు హీరో కిరణ్ అయితే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరీ..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com