అట్టహాసంగా ప్రారంభమైన ‘ఛూ మంతర్‌’

అట్టహాసంగా ప్రారంభమైన ‘ఛూ మంతర్‌’
అద్వితీయ మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఛూ మంతర్‌ అనే సినిమాతో దర్శకునిగా పరిచయమౌతున్నాడు బి.కళ్యాణ్

అద్వితీయ మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఛూ మంతర్‌ అనే సినిమాతో దర్శకునిగా పరిచయమౌతున్నాడు బి.కళ్యాణ్. ఈ సినిమాను వెంకట్‌ కిరణ్‌ కుమార్‌ కాళ్లకూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా చరణ్‌ లక్కరాజు, యశశ్రీ జంటగా నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా పనులలను చిత్ర బృందం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించింది. ‘ఎబిసిడి’ మూవీ దర్శకుడు సంజీవ్‌రెడ్డి క్లాప్‌నివ్వగా ‘ఉరి ’ సినిమా దర్శకుడు శ్రీనివాస్‌ తొలిషాట్‌కు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ‘బలగం’ ఫేమ్‌ రూపాలక్ష్మీ, ‘చిత్రం’ శ్రీను యోగి కత్రి, ‘జబర్దస్త్‌’ కుమరం, గడ్డం నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. సుధా శ్రీనివాస్ సంగీత దర్శకుడిగా కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ అందిస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story