ఓటీటీలోకి దూసుకువచ్చేస్తున్న మసూద

హైదరాబాద్
ఓటీటీలోకి దూసుకువచ్చేస్తున్న మసూద
ఇటీవలే థియేటర్లలో విడుదలైన మసూద ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మందిని అలరించేందుకు సిద్ధమవుతోంది. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో ఓటీటీలో సందడి చేయబోతోంది.

టాలీవుడ్ :

మంచి కథా కథనాలు ఉంటే చాలు స్టార్ క్యాస్ట్, బడ్జెట్ తో సంబంధం లేకుండా ఎలాంటి సినిమానైనా ఆదరిస్తాం అని ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు. రొటీన్ ఫార్ములా కథలను సైతం అదే రేంజ్ లో రిజెక్ట్ చేస్తున్న సందర్భాలూ అనేకం. ఇక హారర్ జోనర్ లో ఈ మధ్య గ్యాప్ ను ఫిల్ చేసేందుకు మసూద అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి కథా కథనాలతో ఆకట్టుకున్న మసూద, టేకింగ్ విషయంలో కాస్త తడబడినప్పటికీ మంచి టాక్ సంపాదించుకుంది. తాజాగా ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి దూసుకువచ్చేస్తోంది.

సీనియర్ హీరోయిన్ సంగీత, తిరువీర్, బాంధవీ శ్రీధర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విమర్శకులు సైతం మంచి మార్కులే వేశారు. ముఖ్యంగా లీడ్ క్యాస్ట్ నటనతో ఆకట్టుకోవడం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలం అని ఇప్పటికే థియేటర్లలో సినిమాను చూసిన వారికి అర్థమయ్యే ఉంటుంది. అయితే సిల్వర్ స్క్రీన్ లో ఆ థ్రిల్ ను మిస్ అయిన వారు ఓటీటీలో అదే ఫీలింగ్ తో మూవీని ఎంజాయ్ చేయవచ్చు.

అచ్చు తెలుగు ఓటీటీగా పేరుగాంచిన ప్లాట్ ఫార్మ్ పై మసూద స్ట్రీమింగ్ అవ్వబోతంది. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, మళ్లీ రావా వంటి సినిమాలతో మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరుగాంచిన రాహుల్ యాదవ్ మంచి నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించారు. సాయి కిరణ్ దర్శకత్వం వహించగా సత్యం రాజేశ్, శుభలేఖ సుధాకర్ రొటీన్ కు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. మరి డిసెంబర్ 21 నుంచి ఆహాలో సందడి చేయబోతున్న మసూద నెటిజెన్లను సైతం అదే రీతిన ఆకట్టుకుంటుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story