సంక్రాంతి సినిమాలకు కొత్త రేట్లు ఇవి

సంక్రాంతి సినిమాలకు కొత్త రేట్లు ఇవి
బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' చిత్రాల టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం.

సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' చిత్రాల టికెట్‌ ధరలను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. మైతీ మూవీ మేకర్స్‌ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టికెట్‌ ధరపై గరిష్ఠంగా రూ. 45 (జీఎస్టీ అదనం) పెంచుతూ ఇవాళ నిన్న జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది. ఒక్కో సినిమాకు 'వీరసింహారెడ్డి' టికెట్‌ ధర రూ. 20 పెంచుకునేందుకు, 'వాల్తేరు వీరయ్య' టికెట్‌ ధర రూ. 25 పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదల తేదీ నుంచి 10 రోజుల వరకూ కొత్త రేట్లు వసూలు చేసుకోవచ్చు. అలాగే స్పెషల్‌ షోలకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. బాలయ్య సినిమా రేపు , చిరు చిత్రం ఎల్లుండి విడుదల కానున్నాయి.

Tags

Next Story