Tollywood: ఆసక్తికరంగా 'ఏందిరా ఈ పంచాయితీ' టైటిల్ లోగో

రొటీన్ కు భిన్నమైన కథలకు ఇప్పుడు మంచి మార్కెట్ నడుస్తోందనే చెప్పాలి. వైవిధ్యంగా కథలు చెప్పే దర్శక నిర్మాతలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రస్తుతం రచయితలు సైతం తమ మూలాల్లోకి వెళ్లి కథలు రాసుకుంటున్నారు. గ్రామీణ వాతావరణాన్ని తెరపై చూపించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రేక్షకులు సైతం అలాంటి సినిమాలనే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే 'ఏందిరా ఈ పంచాయితీ' అనే సినిమా రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తోన్న ఈ మూవీతో గంగాధర టీ దర్శకుడిగా పరిచయం అవనున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ లోగో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కత్తెర, కోడి, బోరింగ్, తాటి చెట్లు, మనుషులు పరిగెత్తడం వంటి అంశాలతో పోస్టర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి తొలి పోస్టర్ తోనే జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఏందిరా ఈ పంచాయితీ ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి. పాత్రలను పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com