పరశురామ్ వారి పాట...
ఇండస్ట్రీ లో హిట్స్ తో పాటు క్యారెక్టర్ కూడా అవసరం. మొదటిది ఉంటే చాలు రెండోది అవసరం లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు డైరెక్టర్ పరుశురామ్. అడ్వాన్స్ లు అందుకొని ఆఫీస్ లు తెరిపించి మరో కాంబినేషన్ సెట్ అవగానే ఇచ్చిన మాట గాలికొదిలేసి తన దాని తను చూసుకొని ప్రొడక్షన్ హౌస్ లను, తనను నమ్మిన హీరోలను నాలుగు రోడ్ల కూడలిలో వదిలేస్తున్నాడట.. ఈ ఆట ఎప్పటి నుంచో ఆడుతున్న పరుశురామ్ పై ఇప్పుడు చాలా ఇండస్ట్రీ గుర్రుగా ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో పరశురాం పేరు చెప్తే టైమ్ వేస్ట్ అంటున్నారు టాప్ హీరోలు...
గీతా గోవిదం సూపర్ హిట్ అయిన తర్వాత మరో సినిమా చేసే ఓప్పందం మీద గీతా నుండి అడ్వాన్స్ అందుకున్నడట పరుశురామ్. తర్వాత మైత్రి లో సర్కారు వారి పాట సెట్ అవడంతో అది చేసుకొని వస్తాను అని అరవింద్ గారికి మాట ఇచ్చాడు. గీతా వారు కూడా మహేష్ తో సినిమా కదా అని చేసుకురమ్మని పంపారట. కానీ పరుశురామ్ అప్పటికే అందిన చోటల్లా అడ్వాన్స్ లు పుచ్చుకొని ఎవరు అడిగినా నెక్ట్స్ సినిమా నీకే అనే డైలాగ్ ని లూప్ లో వాడుతూ బాగానే అడ్వాన్స్ ల రూపంలో డబ్బులు పోగేయ్యడం మొదలు పెట్టాడట. ఎవరికి వారు తమతోనే డైరెక్టర్ ఉన్నాడన బ్రమలో చాలా ప్రొడక్షన్ హౌస్ లను ఉంచాడటని టాక్.
వారిలో మొదట గీత ఆర్ట్స్, తరవాత 14 రీల్స్ బ్యానర్ లు..
మొదట గీత ఆర్ట్స్ లో గీత గోవిందం 2 స్టార్ట్ చేద్దాం అని చెప్పి... దిల్ రాజు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ముందు రోజు సాయంత్రం వరకు గీత ఆఫీస్ లో ఉండి తెల్లారి దిల్ రాజు తో సినిమా అనౌన్స్ మెంట్ చేసాడు. గీతా ఆర్ట్స్ కి అసలు సినిమా కనపడింది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి చాలా కోపం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ దర్శకుడి లీలలు బట్టబయలు చేయడానికి రెడీ అయ్యాడు. ఇంతలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేరుతో నడుస్తున్న మాఫియా నుండి పెద్దలు రంగంలోకి దిగి ఆయన నోరు నొక్కరు..
తరవాత 14 రీల్స్ బ్యానర్లో నాగ చైతన్య కాంబినేషన్ లో పరుశురామ్ సినిమా కోసం భారీ మొత్తంలో అడ్వాన్స్ లు సమర్పించారు. ఆఫీస్ లు తీసి స్టాఫ్ ని అందించి పని కూడా మొదలు పెట్టారు. నాగచైతన్య కథ విని ఒకే అనడం కూడా జరిగింది..మరో ఒక కథ కు తమిళ హీరో ఐతే బాగుంటుంది నిర్మాతలకు చెప్తే తమిళ హీరో కార్తికి డైరక్టర్ తో కథ చెప్పించి ఒప్పించారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తున్న కథ నాగ చైతన్య నచ్చి ఒప్పుకున్న కథ కావడం 14 రీల్స్ వారికి నాగ చైతన్య కు మరింత కోపం వచ్చింది. సెప్టెంబర్ 1న ఖుషి రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ జెర్సీ డైరెక్టర్ తో సితార లో సినిమా కోసం డేట్స్ ఇస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమాతో నిర్మాతలు బాగా బిజీ గా ఉండటంతో ఈ సినిమా ను సంక్రాంతి కి కాకుండా సమ్మర్ లో వస్తుందని నాగ వంశీ హీరో విజయ్ దేవరకొండ కి చెప్పడం తో అసలు కథ మొదలైంది. ఇప్పుడు సెప్టెంబర్ 10 నుంచి దిల్ రాజు విజయ్ తో తన సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుని మే 6న పూజ చేసి ప్రారంభిద్దాం అనుకుంటే 14 రీల్స్ వారు అడ్డుపడ్డారు. మరి మా పరిస్థితి ఏమిటి అనడంతో రాజీ కోసం దిల్ రాజు టీం, సితార నాగ వంశీ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు..
దర్శకుడు కథలలో ట్విస్ట్ లు ఇస్తే బాగుంటుంది కానీ సినిమా తీయడానికి పరుశురామ్ ఇచ్చే ట్విస్ట్ లు చాలా దారుణంగా ఉన్నాయి అంటున్నారు నిర్మాతలు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే నాగచైతన్య ఈ మధ్య ఒక ఇంటర్యూలో పరుశురామ్ పేరు చెప్పగానే అతని గురించి మాట్లాడటమే వేస్ట్ అని ఓపెన్ గా అనేసాడు. టాలెంట్ తోపాటు క్యారెక్టర్ కూడా అవసరం అని తెలుసుకుంటే ఇండస్ట్రీలో నాలుగు రోజులు ఉంటాడని కొంతమంది బాహాటంగానే హెచ్చరిస్తున్నారట. ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్న బ్యానర్స్ లో ఇప్పటికే కొన్ని ఇతని పేరు చెబితేనే బాబోయ్ వద్దులే అని అంటున్నారట. విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్ తరవాత చేస్తున్న సినిమా కావున ఇలాంటి తలనొప్పి ఉన్న డైరెక్టర్ తో ఎలా పని చేయాలి అని నిర్మాతలు దగ్గర వాపోయాడని తెలిసింది...
ఇక్కడ మనం ఒకటి గుర్తుకు తెచ్చుకోవాలి..
కోవిడ్ సమయం లో అన్నపూర్ణ స్టూడియోలో మీటింగ్ పెట్టి మనకు నిర్మాతలు అవసరం ఏముంది అని మాట్లాడిన రాజమౌళి, కొరటాల శివ ఈ విషయంలో ఎలా మాట్లాడుతారో చూడాలి. RRR నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంలో రాజమౌళి ఎక్కడా ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య పేరు చెప్పకపోవడం గుర్తు పెట్టుకోవాలి... తన యమదొంగ సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బంది పడ్డ విషయం పూర్తిగా మర్చి పోయాడు రాజమౌళి. ఆచార్య సినిమా విషయంలో నిర్మాత రోల్ కూడా తానే చాలా యాక్టివ్ గా ప్లే చేసి తన కెరీర్ కు సరిపోయిననంత చెడ్డ పేరు తెచ్చుకున్న కొరటాల శివ. ఎన్టీఆర్ ఆర్ట్స్ విషయంలో ఏం చేస్తాడు అని కూడా సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు పరుశురామ్ విషయం ఎటు నుంచి ఎటు వైపు తిరుగుతుందా అని ఇండస్ట్రీ పెద్దలు తల పట్టుకుని కూర్చున్నారు.
YJR
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com