హారోడ్స్ లో విరానిక మంచు “MAISON AVA” ప్రారంభం

మంచు విష్ణు భార్య విరానికా లండన్ స్టోర్ హారోడ్స్ లో తన సొంత స్టోర్‌ను ప్రారంభించింది. ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ అయిన హారోడ్స్ లో “MAISON AVA” అనే చిన్నపిల్లల దుస్తుల స్టోర్‌ను ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని వెల్లడించింది. ఇక్కడ 2-14 సంవత్సరాల అబ్బాయిలు, అమ్మాయిల కోసం షో-స్టాపింగ్ కోచర్ మెటీరియల్స్ ఇందులో లభిస్తాయి.
ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కోచర్ హౌస్‌లలో శిక్షణ పొందిన నిపుణులైన డిజైనర్ల స్వహస్తాలతో రూపొందించిన ప్రత్యేకమైన కలెక్షన్ “MAISON AVA” లభ్యమవుతాయని తెలిపింది. తమ డిజైన్లలో పిల్లల సౌకర్యానికే పెద్ద పీట వేస్తామని, ప్రతి వస్త్రాన్ని వ్యూహాత్మకంగా రూపొందిస్తామని తద్వారా పిల్లలు ధరించడానికి ఇష్టపడే దుస్తులలో వారు సులభంగా కదలవచ్చునని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com