జయమ్మ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
వరలక్ష్మి శరత్ కుమార్... ఈ పేరు చెబితే ప్రేక్షకులు తొందరగా గుర్తుపట్టకపోవచ్చు.. కానీ జయమ్మ అంటే అందరూ తొందరగానే గుర్తుపడుతారు. తాజాగా రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మగా ఆదరగోట్టింది వరలక్ష్మి.. దీనితో ఇప్పుడు ఆమెను ప్రేక్షకులు జయమ్మ అనే పిలుస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా అల్లరి నరేష్ హీరోగా వచ్చిన నాంది సినిమాలో కూడా మరో పవర్ఫుల్ పాత్రలో నటించింది వరలక్ష్మి.. అయితే ఈమె పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. !
* వరలక్ష్మి నటుడు శరత్‌కుమార్ మరియు చాయా దంపతులకు మార్చి 5, 1985 న జన్మించారు.
* వరలక్ష్మికి నలుగురు తోబుట్టువులు.. ఇందులో వరలక్ష్మి పెద్దది.. ఈమెకి ఒక చెల్లెలు ఒక తమ్ముడు రాహుల్ ఉన్నారు. వీరితో పాటుగా ఆమె సవతి తల్లి రాధికకి ఓ కూతురు ఉన్నారు. ఆమె వరలక్ష్మికి సోదరి అవుతుంది ఆమె రాయన్నే హార్డీ.
* వరలక్ష్మి ప్రస్తుతం తన తల్లి చాయాతో కలిసి ఉంటున్నారు.
* వరలక్ష్మి చెన్నైలోని హిందుస్తాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి మైక్రోబయాలజీలో మరియు ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పట్టా పొందారు.
* నటి కావడానికి ముందే వరలక్ష్మి ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ నుండి డిగ్రీ పొందారు.
* విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన "పోరడా పోడి" అనే తమిళ చిత్రం ద్వారా 2012లో వరలక్ష్మి సినీరంగ ప్రవేశం జరిగింది.
* ఆ తర్వాత బాలా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం "తారై తప్పట్టై"లో ఛాలెంజింగ్ రోల్ పోషించింది వరలక్ష్మి..
* హీరోయిన్ గా కాకుండా సినిమాలో పాత్రకీ ప్రాధాన్యత ఉంటే చేయడానికి సిద్దపడింది వరలక్ష్మి.. అందులో భాగంగానే విజయ్ హీరోగా వచ్చిన సర్కార్ సినిమాలో ఆమె విలన్ గా నటించారు.
* 2014లో మానిక్య చిత్రంతో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి. 2016 లో కసబా చిత్రంతో మమ్ముట్టి సరసన నటించి మలయాళంలోకి అరంగేట్రం చేసింది. ఇక సుందీప్ కిషన్ హీరోగా జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ సినిమాతో 2019లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
*నటుడు విశాల్ కృష్ణతో ప్రేమలో ఉన్నట్టుగా, పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. కాని ఆ తర్వాత అవి రూమర్స్ గా మారిపోయాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com