రాపో20 థండర్ టీజర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాస్ స్టోరీలపై దృష్టిపెట్టాడు. పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌తో రామ్‌కు మాస్ ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది. దీంతో మరోసారి మాస్ వైపే మొగ్గు చూపుతున్నాడు యువ హీరో. ఈ క్రమంలోనే మాస్ కథలకు బాప్‌గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీనుతో తన 20వ సినిమా తీస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా రామ్ అభిమానుల్లో హుషారు పెరిగింది.
రాపో20లో రామ్ సరసన హైపర్ గర్ల్ శ్రీలీల మెరవనుంది. ఈ సినిమా పనులు హైదరాబాద్‌లో వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా బోయపాటిరాపో థండర్ పేరిట ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో రామ్ అదిరిపోయే మాస్‌లుక్‌లో కనిపిస్తుండగా, థమన్ దిమ్మతిరిగే బ్యాగ్‌రౌండ్ మ్యూజిక్ అందించాడు. దీంతో టీజర్ చూసిన అభిమానులు శివాలెత్తుతున్నారు. ఈ సినిమా గనుక హిట్ అయితే రామ్ పాన్ ఇండియా స్టార్ అవడం ఖాయమంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com