Gopichand: వాటన్నింటికి రుణపడి ఉంటాను.. గోపీచంద్ ఎమోషనల్ ట్వీట్..

Gopichand: విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వచ్చి ఆ తర్వాత హీరోలుగా మారిన నటుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. అందులోనూ టాలీవుడ్‌లో మరీ తక్కువ. అలా విలన్ నుండి హీరోగా మారిన వారిలో గోపీచంద్ ఒకరు. విలన్‌గా అందరినీ భయపెట్టి.. ఎంతోమందికి ఫేవరెట్‌గా మారిన తర్వాత హీరోగా గోపీచంద్‌కు ఛాన్స్ వచ్చింది. తాజాగా తను ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు పూర్తికాగా గోపీచంద్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
గోపీచంద్ తండ్రి టి. కృష్ణ సినీ పరిశ్రమలోనే పనిచేసేవారు. కానీ తండ్రి హఠాన్మరణంతో గోపీచంద్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్న తర్వాత హీరోగా గోపీచంద్‌కు అవకాశం వచ్చింది. కానీ ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో తనకు వచ్చిన విలన్ రోల్స్‌ను ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. ఆపై హీరోగా మారాడు. ఇప్పటికీ గోపీచంద్‌ను మరోసారి విలన్‌గా చూడాలని తన అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.
గోపీచంద్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 21 ఏళ్లు పూర్తయ్యింది. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'ఇండస్ట్రీలో 21 ఏళ్లు. నాకు ఎదురుగా వచ్చిన అనుభవాలకు, పాఠాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ ప్రేమ, సపోర్ట్ లేకుండా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నా ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున థాంక్యూ' అని ట్వీటర్ ద్వారా తెలిపాడు గోపీచంద్.
21 years in the industry.. Grateful for everything that came my way and all the learnings. I wouldn't be where I am today without all your love and support. Thank you to each and everyone who's been a part of my journey!#21YrsOfGopichandInTFI
— Gopichand (@YoursGopichand) August 3, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com