"ఆదిత్య 369" మూవీకి నేటితో ముప్పై ఏళ్ళు

ఆదిత్య 369 మూవీకి నేటితో ముప్పై ఏళ్ళు
టైమ్ లెస్ మూవీస్ అని కొన్ని ఉంటాయి. టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ తో అలా టైమ్ లెస్ గా మిగిలిపోయిన గ్రేటెస్ట్ మూవీ ఆదిత్య 369.

టైమ్ లెస్ మూవీస్ అని కొన్ని ఉంటాయి. టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ తో అలా టైమ్ లెస్ గా మిగిలిపోయిన గ్రేటెస్ట్ మూవీ ఆదిత్య 369. సినిమా అనేదే ఫిక్షన్. ఆ ఫిక్షన్ లోనే ఫాంటసీని మిక్స్ చేసి చూస్తోన్న ప్రేక్షకులను మరో లోకానికి తీసుకువెళ్లడం దాని పని. అయితే ఆ లోకం నిజంగానే మరో కాలంలోనిది అయితే, అది ఖచ్చితంగా క్లాసిక్ అవుతుంది. అందుకే ఆదిత్య 369 ఆల్ టైమ్ ఇండియన్ క్లాసిక్స్ లో చోటు సంపాదించుకుంది. సైన్స్ ఫిక్షన్, పీరియాడిక్, ఫాంటసీ, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ అంటూ అన్ని జానర్స్ నూ సమపాళ్లలో మిక్స్ చేసిన మెస్మరైజింగ్ మూవీ ఆదిత్య 369 విడుదలై నేటికి ముప్ఫైయేళ్లు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను మేకర్స్ జ్ఞాపకాలను ఓ సారి చూద్దాం..

ప్రతి మనిషీ కాలం కొన్నాళ్లు వెనక్కి వెళితే బావుండు అనుకుంటాడు. కానీ అది సాధ్యమా..? నిజంగా అయితే కాదు.. మరి ఊహల్లో అయితే.. ఆ ఊహ వెండితెరపై కనిపిస్తే.. అచ్చెరువొందుతాం. ఆనందం పొందుతాం. ఇక ఆ సినిమా తీసిన వ్యక్తి లెజెండ్ అయితే.. అది కాలాలు మారినా తన తాజాదనాన్ని కోల్పోదు. అలాంటి గ్రేట్ పిక్చరే ఆదిత్య 369. అప్పటికే గ్రేట్ ఫిల్మ్ మేకర్ అనిపించుకున్న సింగీతం శ్రీనివాసరావు మది నుంచి జాలువారిన చిత్రరాజం ఆదిత్య 369 30యేళ్లే కాదు.. మరో 30యేళ్లైనా ఫ్రెష్ నెస్ కోల్పోని సినిమా అంటే అతిశయోక్తి కాదు.

ఒక గొప్ప కథ ఆవిష్కృతం కావడం ఆలోచన చేసినంత సులభం కాదు. ఆ ఆలోచనను నిర్మాత నమ్మాలి. అతని నమ్మకాన్ని దర్శకుడు నిలబెట్టాలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఒక తపస్పులా పనిచేయాలి. అప్పుడే ఇలాంటి క్లాసిక్స్ సాధ్యమవుతాయి. బాలకృష్ణ కెరీర్లో టాప్ హిట్స్ అనదగ్గ చిత్రాల్లో ఖచ్చితంగా ఆదిత్య 369 ముందు వరుసలో ఉంటుంది. కమర్షియల్ సక్సెస్ తో పాటు నటుడుగానూ బాలయ్యకి ఆదిత్య 369 మంచి పేరుని తెచ్చిపెట్టింది. శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో నటించి మెప్పించి ప్రశంసలు అందుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story