Liger Movie: రిలీజ్‌కు ముందే 'లైగర్' క్రేజ్.. 75 అడుగుల భారీ కటౌట్..

Liger Movie: స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగే వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోల సినిమాల బిజినెస్ విషయంలోనే కాదు.. కటౌట్ దగ్గర కూడా ఫ్యాన్స్ పోటీపడుతుంటారు. కానీ రౌడీ హీరోకు మాత్రం సినిమా రిలీజ్‌కు ముందే కటౌట్ పెట్టేశారు తన ఫ్యాన్స్. ఇప్పటికీ లైగర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాకముందే ఈ కటౌట్‌తో ఆ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమయిపోతోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అందులోనూ ముఖ్యంగా యూత్‌లో తన ఫాలోయింగ్ మైండి బ్లోయింగ్. అలాంటి విజయ్.. చివరిగా 'వరల్డ్ ఫేమస్ లవర్'తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ డిసాస్టర్‌గా నిలిచింది. అయినా కూడా పూరీ జగన్నాధ్‌లాంటి డ్యాషింగ్ డైరెక్టర్‌తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు విజయ్ దేవరకొండ.
పూరీ, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రమే 'లైగర్'. ఈ మూవీ ఆగస్ట్ 25న విడుదల కానుంది. ఇప్పటికే లైగర్ టీజర్‌తో తనలోని ఫైర్‌ను చూపించిన విజయ్.. ఇప్పుడు ట్రైలర్ లాంచ్‌కు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో 75 అడుగుల విజయ్ కటౌట్‌ను పెట్టారు ఫ్యాన్స్. కనీసం ట్రైలర్ కూడా విడుదల కాని ఒక మూవీకి ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Just One more Night's sleep
— Vijay Deverakonda (@TheDeverakonda) July 20, 2022
And we will see you with #LigerTrailer.
I am for sure not sleeping :) pic.twitter.com/JCaBdVxqdN
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com