వివాదంలో 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' చిత్రం..!

హిందువుల విశ్వాసాలను గాయపరుస్తున్నారంటూ 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' మూవీ యూనిట్‌పై హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్‌లో వీహెచ్‌పీ నేతలు ఫిర్యాదు చేశారు. భజగోవిందం కీర్తనలతో సన్నివేశాలను అసభ్యకరంగా చిత్రీకరించారంటూ వీహెచ్‌పీ అధికారప్రతినిధి రావినూతల శశిధర్, బీజేపీ నేత పోచంపల్లి గిరిధర్ మండిపడ్డారు. చిత్ర ట్రయల్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన దర్శకుడు, నిర్మాత, నటీనటులపై క్రిమినల్ కేసులు పెట్టాలని వీహెచ్‌పీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. చర్యలు చేపట్టకుంటే చిత్రం విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు బీజేపీ నేతలు. కాగా యువ నటీనటులు హస్వంత్ వంగ, నమ్రతా దరేకర్, వశిష్ట చౌదరి ప్రధాన పాత్రల్లో వై .యుగంధర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com