సమంత.. ' నువ్వే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవర్'... సామ్ రీట్వీట్..!

Samantha Akkineni : హీరోలకే కాదు.. హీరోయిన్ లకి కూడా సమానంగా అభిమానులు ఉంటారు. హీరోయిన్స్ అంటే పడిచచ్చే కుర్రాళ్లు చాలానే ఉన్నారు. కొందరైతే వారికి ఏకంగా గుడికట్టేశారు. అయితే ఓ అభిమాని భిన్నంగా చేతిపై టాటూ వేసుకుని హీరోయిన్‌పై తనుకున్న ప్రేమను చాటుకున్నాడు. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంత.. ఇదే షాకింగ్ న్యూస్ లాగా ఉంటే అభిమాని చేసిన ఆ ట్వీట్‌ని సామ్ రీట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పవన్ సమ్ము పేరుతో ఓ నెటిజన్ ట్విటర్ ఖాతా ఓపెన్ చేశాడు. అందులో సమ్ము అంటూ టాటూ వేసుకుని ఫోటోలను సమంతకి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు 'మై ఫస్ట్ అండ్ మై లాస్ట్ లవ్ నువ్వే సమ్ము. నీపై ఉన్న ప్రేమ అనంతమైనది. ఇప్పుడ నా ప్రేమ శాశ్వతం.. ఈ టాటూ కూడా శాశ్వతం' అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన సామ్ దానిని రీట్వీట్ చేస్తూ షాకింగ్ ఎమోజీలను జత చేసింది. దీనితో ఇది వైరల్ గా మారింది.
— S (@Samanthaprabhu2) September 16, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com