RRR Movie: ఇజ్రాయెల్‌లో 'ఆర్ఆర్ఆర్' క్రేజ్.. పత్రికలో ఎన్‌టీఆర్ ఫోటో..

RRR Movie: 'ఆర్ఆర్ఆర్' మూవీ గురించి చెప్పడానికి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. బాహుబలి తర్వాత మూవీ లవర్స్ అంతా దర్శక ధీరుడు రాజమౌళిపై పెట్టుకున్న నమ్మకాన్ని, అంచనాలను మరోసారి నిలబెట్టుకున్నాడు. ఆర్ఆర్ఆర్.. బాహుబలిని మించిన హిట్ అయ్యింది. ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లను పాన్ ఇండియా స్టార్‌లుగా నిలబెట్టింది. అందుకే ఈ సినిమా క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.
కేవలం తెలుగులోనే కాదు.. ఆర్ఆర్ఆర్ సినిమా విడులదయిన ప్రతీ భాషలో సూపర్ హిట్ అందుకుంది. ఇండియన్ భాషల్లోనే కాదు ఫారిన్ భాషల ప్రేక్షకులను కూడా ఈ మూవీ మెప్పించింది. ఇప్పటికీ ఎంతోమంది హాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యేకంగా ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రశంసించారు. తాజాగా ఓ ఇజ్రాయెల్ వార్తాప్రతికాలో ఆర్ఆర్ఆర్ గురించి ఆర్టికల్ రావడం విశేషం.
ఆర్ఆర్ఆర్ ప్రతీ భాషలో జీ 5లోనే విడుదలయినా.. ఒక్క హిందీకి మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. దీంతో చాలామందికి ఈ సినిమా దగ్గరయ్యింది. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ ఆర్టికల్ ఇజ్రాయెల్ న్యూస్ పేపర్‌లో ప్రచురితమయ్యింది. ప్రస్తుతం ఈ ఆర్టికల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఏం రాసుందో అర్థం కాకపోయినా.. ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉందని మాత్రం అర్థమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com