మహానటి సావిత్రి లాగే.. ఈ నటి జీవితంలో కూడా ఎన్నో విషాదాలు.. వరుస లవ్‌ ఫెయిల్యూర్స్‌..!

మహానటి సావిత్రి లాగే..  ఈ నటి జీవితంలో కూడా ఎన్నో విషాదాలు.. వరుస లవ్‌ ఫెయిల్యూర్స్‌..!
సినీ సెలబ్రిటీస్ అంటే లగ్జరీ లైఫ్, చాలా డబ్బు, బాధలు అంటే ఏంటో తెలియవు.. ఇవి సాధారణ సినీ ప్రేక్షకుడు అనుకునే మాటలు.

సినీ సెలబ్రిటీస్ అంటే లగ్జరీ లైఫ్, చాలా డబ్బు, బాధలు అంటే ఏంటో తెలియవు.. ఇవి సాధారణ సినీ ప్రేక్షకుడు అనుకునే మాటలు.. కానీ నవ్వుతూ కనిపించే సినీ తారల జీవితాల వెనుక కూడా ఎన్నో విషాదాలు ఉంటాయి. ఎన్నో కన్నీళ్లు ఉంటాయి. నటిగా మెప్పించి ఎంతోమంది ప్రేక్షకుల గుండెల్లో గుడికట్టుకున్న అభినయ నేత్రి, మహానటి సావిత్రి జీవితంలో ఎన్నో విషాదాలు నెలకొన్నాయి. చివరి రోజుల్లో సావిత్రి ఎలాంటి కష్టాలు పడ్డారో.. కొన్నింటిని మహానటి చిత్రంలో దర్శకనిర్మాతలు చూపించారు. సరిగ్గా సావిత్రి లాగే.. నటి శ్రీవిద్య కూడా కష్టాలు పడి చివరి రోజుల్లో క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. వీరి జీవితాలకి చాలా దగ్గరి పోలికలు ఉండడం విశేషం.

1953, జులై 24న మద్రాస్‌లో జన్మించారు శ్రీవిద్య.. ఆమెది సినీ నేపధ్యం ఉన్న కుటుంబమే.. తండ్రి కృష్ణమూర్తి.. ఆయన సినిమాల్లో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆమె తల్లి వసంతకుమారి కర్ణాటక క్లాసిక్‌ సింగర్‌. అయితే శ్రీవిద్య పుట్టిన కొన్నాళ్లకే తండ్రి పక్షవాతం బారినపడడంతో ఆమె ఇంట్లో ఆర్ధిక సమస్యలు మొదలయ్యాయి. తల్లి వసంతకుమారి నానాకష్టాలు పడి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. కుటుంబానికి భారం కాకూడదన్న ఉద్దేశంతో తండ్రి పరిచయాలతో శ్రీవిద్య సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1967లో శివాజీ గణేషన్‌ హీరోగా 'తిరువరుల్చెల్వర్‌'లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఆమె కెరీర్ మొదలైంది. ఆ తర్వాత మలయాళ, తెలుగు బాషల్లో నటించింది శ్రీవిద్య. ఇక హీరోయిన్‌గా 'ఢిల్లీ టు మద్రాస్‌'(1972) ఆమెకి మొదటి సినిమా కావడం విశేషం. హీరోయిన్‌‌‌‌గా స్టార్స్ అందరితో పనిచేసిన శ్రీవిద్య .. హీరోయిన్‌‌‌గా ఫెడ్ అవుట్ అయ్యాక కూడా ఎన్నో చిత్రాలలో అద్భుతమైన పాత్రలను పోషించారు. ముఖ్యంగా కొన్ని సినిమాల్లో అయితే తల్లి పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఉహించుకోలేము కూడా.

అయితే వరుస ప్రేమలు ఆమెను మానసికంగా బాగా కృంగదీశాయని చెప్పాలి. హీరోయిన్‌‌‌గా ఫుల్ స్వింగ్‌‌లో ఉన్నప్పుడు.. మొదటగా కమల్‌‌‌హసన్‌‌‌తో పీకలలోతు ప్రేమలో పడిపోయింది శ్రీవిద్య.. అయితే అప్పటికే కమల్.. వాణీ గణపతితో ప్రేమలో ఉండడంతో ఆమె తప్పుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మలయాళంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయిన జార్జ్‌ థామస్‌తో ప్రేమలో పడింది. తల్లిదండ్రుల మాట వినకుండా మతం మార్చుకొని మరి అతన్ని వివాహం చేసుకుంది. కొన్నిరోజులకి భర్త అసలు తీరు బయటపడడంతో అతనికి విడాకులు ఇచ్చేసింది. మళ్ళీ నటనను కొనసాగిస్తున్న సమయంలో మలయాళ దర్శకుడు భరతన్‌తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం కొనసాగించింది. అయితే అతను మరొకరిని వివాహం చేసుకున్నాడు. అయితే భరతన్‌ తన ఆస్తులు లాగేసుకుని తనను మోసం చేశాడంటూ శ్రీవిద్య కోర్టుకెక్కి విజయం సాధించింది.

ఆ తర్వాత చెన్నై నుంచి తిరువనంతపురానికి మకాం మార్చిన శ్రీవిద్య.. అక్కడే స్థిరపడిపోయింది. ఇక 2003లో తనకి క్యాన్సర్ సోకడంతో మూడేళ్ళ పాటు చికిత్స తీసుకుంది. అయినప్పటికీ క్యాన్సర్ తగ్గకపోవడం, బతకడం కష్టమనే విషయం తెలియడంతో తన పేరు మీద చిల్లగవ్వా ఆస్తి కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకుంది. తన ఆస్తిలో కొంత భాగాన్ని పేద సంగీత, నృత్య కళాకారులైన విద్యార్థుల కోసం ఓ ఛారిటబుల్‌ సొసైటీ ఏర్పాటు చేసి వారికి స్కాలర్‌షిప్‌ అందించేలా ఏర్పాటు చేయించింది. ఇక మిగిలిన ఆస్తిని బంధువుల పేరిట రాసింది. అంతేకాకుండా.. తన ఇంట్లో పని వాళ్లు.. వాళ్ల ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఇచ్చేసింది. కొంత సొమ్మును తన సొంత ఊరికి, రెండో ఇల్లు అయిన తిరువనంతపురానికి దానం చేసింది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న టైంలోనే 2006, ఆగస్టు 17న ఆమె కన్నుమూశారు. అప్పటికి శ్రీవిద్యకి 53ఏళ్ళు మాత్రమే.. ఆమె అంత్యక్రియల్ని తిరువనంతపురం ప్రజలు లాంఛనంగా జరిపించారు.

Tags

Read MoreRead Less
Next Story