నువ్వు నాకు నచ్చావ్‌‌కి 20 ఏళ్ళు.. ముందుగా అనుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా?

నువ్వు నాకు నచ్చావ్‌‌కి 20 ఏళ్ళు.. ముందుగా అనుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా?
ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌‌కి మంచి పేరుంది. అలాంటి వెంకీకి ఖతర్నాక్ కామెడీ తోడైతే ఆ సినిమా ఎలా ఉంటుందో చూపించిన సినిమా.. నువ్వు నాకు నచ్చావ్ ..

ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌‌కి మంచి పేరుంది. అలాంటి వెంకీకి ఖతర్నాక్ కామెడీ తోడైతే ఆ సినిమా ఎలా ఉంటుందో చూపించిన సినిమా.. నువ్వు నాకు నచ్చావ్ .. ఇప్పటికీ టీవీలో వచ్చిన మిస్ అవ్వకుండా చూస్తున్నారంటే ఆ సినిమా వారికి ఎంత నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.. 2001 సంవత్సరంలో ఈ చిత్రానికి నేటితో 20 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వేకావాలి సినిమాతో మంచి హిట్ కొట్టిన విజయ్‌‌భాస్కర్, త్రివిక్రమ్ లతో మరో సినిమా చేద్దామని సినిమా ఆఫర్ ఇచ్చారు స్రవంతి రవికిషోర్. అదే నువ్వు నాకు నచ్చావ్..

♦ ఈ సినిమాని కూడా ముందుగా తరుణ్ తోనే చేద్దామని అనుకున్నారు. కానీ ఇంత వెయిట్ ఉన్న సబ్జెక్ట్ పెద్ద హీరో చేస్తే బాగుంటుందని రవికిషోర్ సలహా ఇచ్చారు.

♦ ఆ టైంలోనే సురేష్ బాబు..రవికిషోర్‌‌కి ఫోన్ చేసి ‌వెంకటేష్ డేట్స్ ఉన్నాయని కథ ఉంటే చేద్దామని ఆఫర్ ఇచ్చారు. విజయ్‌‌భాస్కర్, త్రివిక్రమ్ వెళ్లి వెంకటేష్ కి వెళ్లి కథ చెప్పగా సింగిల్ సిట్టింగ్ లోనే వెంకీ ఒకే చెప్పేశారు.

♦ అయితే కథ రాసుకున్నప్పుడు బ్రహ్మానందం క్యారెక్టర్ లేదు. వెంకటేష్ సలహా మేరకు ఆ క్యారెక్టర్‌‌ని యాడ్ చేశారు. హీరోయిన్‌‌గా ముందుగా త్రిష, గజాలాని అనుకున్నారు. కానీ ఫ్రెష్ లుక్ కోసం విజయ్‌‌భాస్కర్ ఆర్తీ అగర్వాల్‌‌ని తీసుకున్నారు.

♦ ఇక హీరోయిన్ ఫాదర్ పాత్రకి నాజర్‌‌ని విజయ్‌‌భాస్కర్ ఫైనల్ చేస్తే పట్టుబట్టి ప్రకాష్‌‌రాజ్‌‌ని తీసుకున్నారు రవికిషోర్.

♦ సినిమా క్యాస్టింగ్ పూర్తి అయ్యాక.. నానక్‌రామ్‌గూడా రామానాయుడు స్టూడియోలో ఆర్ట్ డెరైక్టర్ పేకేటి రంగాతో హౌస్‌సెట్ వేయించేశారు. దీనికైన ఖర్చు అక్షరాల 60 లక్షలు. సినిమా మొత్తాన్ని చకచక 64 రోజుల్లో పూర్తి చేసారు.

♦ సినిమా షూటింగ్ అయిపోయాక రీరికార్డింగ్ సమయంలో కోటి చేసిన రీ-రికార్డింగ్ మొదటగా రవికిషోర్‌‌కి నచ్చలేదు. మళ్ళీ రీ-రికార్డింగ్ చేసి చూపిస్తే రవికిశోర్.. కోటిని గట్టిగా హగ్ చేసుకొని బెస్ట్ అవుట్ పుట్ అని అన్నారట.

♦ 'ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని...' పాట కోసం 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ఏకంగా 60 పల్లవులు రాశారు. కానీ ఫైనల్‌గా ఫస్ట్ రాసిన పల్లవి ఓకే చేశారు.

♦ సినిమా మొత్తం 3 గంటల 12 నిమిషాలు నిడివి వచ్చింది. సినిమాలోని సుహాసిని ఎపిసోడ్ మొత్తం కట్ చేద్దామని అనుకున్నారు. కానీ రవికిశోర్ పట్టుబట్టడంతో అంతే నిడివితో సినిమాని రిలీజ్ చేశారు.

♦ 2001 సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 93 కేంద్రాలలో 50 రోజులు, 57 కేంద్రాలలో 100 రోజులు, మూడు కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శించబడింది.

♦ ఈ సినిమాలో త్రివిక్రమ్ పంచ్ లకి ఆడియన్స్ ఫిదా.. ఈ సినిమాతోనే త్రివిక్రమ్‌కి మాటల మాంత్రికుడు అనే బిరుదుతో పాటుగా.. స్టార్ రైటర్ హోదా వచ్చేసింది. సునీల్ టాప్ కమెడియన్.. టాప్ డైరెక్టర్ లిస్టులో విజయ్ భాస్కర్ పేరు చేరిపోయాయి.

♦ ఆరు విభాగాల్లో నంది అవార్డు అందుకున్న ఈ సినిమాని కన్నడలో గౌరామ్మ‌‌గా రీమేక్ చేశారు. అక్కడ ఉపేంద్ర, రమ్య నటించారు.. ఇక తమిళంలో వసీగరగా రీమేక్ చేయగా విజయ్, స్నేహ నటించారు. బెంగాలీలో రీమేక్ చేస్తే హిరాన్, శబంతి నటించారు.

♦ ఈ సినిమాని చూసిన నాగార్జున.. త్రివిక్రమ్, విజయభాస్కర్ లని పిలిచి మరి సినిమా చేయమని ఆఫర్ చేశారు అదే "మన్మధుడు".. ఈ సినిమాకి త్రివిక్రమ్ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఓ రైటర్ కి కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం.Tags

Read MoreRead Less
Next Story