తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న..ఆదిపురుష్ టీమ్

తిరుమల వేంకటేశ్వర స్వామిని  దర్శించుకున్న..ఆదిపురుష్ టీమ్
జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఆదిపురుష్ సినిమా ఘన విజయం సాధించాలని కలియుగ ప్రత్యక్షదైవమైన ఆ వేంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు దర్శకుడు ఓం రౌత్ తెలిపారు.

ఆదిపురుష్ టీమ్ తిరుమలలో సందడి చేసింది. హీరోయిన్ కృతిసనన్, దర్శకుడు ఓంరౌత్, నిర్మాత భూషణ్‌కుమార్ సహా పలువురు శ్రీవారి అర్చనసేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానంతరం.. రంగనాయకుల మండపంలో వారికి.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. పట్టువస్త్రాలతో సత్కరించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఆదిపురుష్ సినిమా ఘన విజయం సాధించాలని కలియుగ ప్రత్యక్షదైవమైన ఆ వేంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు దర్శకుడు ఓం రౌత్ తెలిపారు. నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ సక్సెస్ కావడం.. ఇవాళ శ్రీవారిని దర్శించుకోవడం మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగించిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story