Actor Ali: ఘనంగా అలీ కుమార్తె ఎంగేజ్‌మెంట్.. వీడియో వైరల్..

Actor Ali: చాలావరకు సినీ పరిశ్రమలో ఓ స్థాయికి ఎదిగిన వారు తమ వారసులను కూడా తెరపై చూడాలని కలలు కంటుంటారు. కానీ కొందరు మాత్రం అసలు పరిశ్రమతో సంబంధం లేకుండా పెరుగుతారు. తమకు నచ్చిన వృత్తిని ఎంచుకొని అందులోనే సంతోషంగా ఉండాలని భావిస్తారు. తమ పర్సనల్ లైఫ్ గురించి కూడా పెద్దగా బయటికి రానివ్వరు. అలాంటి వారిలో అలీ కుటుంబం ఒకరు.
టాలీవుడ్‌లో కమెడియన్‌గా ఎనలేని గుర్తింపును తెచ్చుకున్నారు అలీ. దాదాపు 40 సంవత్సరాలుగా కమెడియన్‌గా, హీరోగా ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. కానీ ఇప్పటివరకు అలీ కుటుంబం గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ కొంతకాలం క్రితం అలీ భార్య జుబేదా ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. తక్కువ సమయంలోనే ఎంతోమంది సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించుకున్నారు. అప్పటినుండి అలీ వ్యక్తిగత జీవితం గురించి ప్రేక్షకులకు కొంచెంకొంచెంగా తెలుస్తోంది.
అలీ, జుబేదాలకు ముగ్గురు పిల్లలు. అందులో పెద్ద కూతురు ఫాతిమా ఇటీవల మెడిసిన్ పూర్తిచేసింది. తాజాగా ఫాతిమా నిశ్చితార్థాన్ని ఘనంగా చేశారు కుటుంబ సభ్యులు. ఈ వేడుకకు సన్నిహితులతో పాటు కొందరు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకలో సందడి చేశారు. ఈ వీడియోను జుబేదా తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com