ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ.. అందుకే రిజెక్ట్ చేశా: అనసూయ

పెళ్లై పిల్లలుంటే సినిమాల్లో నటించకూడదా అని ప్రశ్నించే వారిని ఓ ఆట ఆడుకుంటుంది అందాల తార అనసూయ. బుల్లి తెర మీద యాంకర్‌గా హొయలు ఒలకబోస్తూనే వెండి తెరపై వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినా అనసూయ అంత తొందరగా ఓకే చెప్పనంటుంది.
తనకు నచ్చితేనే తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే చేస్తానని కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది. అందుకే కదా అత్తారింటికి దారేదీ చిత్రంలో ఇట్స్ టైమ్ టు పార్టీ పాటలో నర్తించే అవకాశం వచ్చినా చేయనని చెప్పిందట. ఏంటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించనన్నావా అంటే.. అవును మరి నలుగురు నటీమణులుంటే నేనెలా కనిపిస్తాను అందుకే చేయనన్నాను.
నేనొక్కదాన్నే అయితే ఆ పాట చేస్తానని చెప్పాను అని చెప్పిందట. సో.. అది వర్కవుట్ కాకపోవడంతో అనసూయా ఆ సాంగ్ నుంచి తప్పుకుంది. కానీ ఆ సినిమా, ఆ పాట ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
నటనను వృత్తిగా ఎంచుకున్నప్పుడు కెమెరా ముందు అందంగా కనిపించడానికి నానా పాట్లు పడాలి. నాజూగ్గా ఉండాలి. ఇక పనీ పాటా లేకుండా అదే పనిగా ట్రోల్ చేసే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. సోషల్ మీడియాలో ఫోటోస్ పోస్ట్ చేస్తే చాలు.. ట్రోల్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇదంతా నీకవసరమా ఆంటీ, పిల్లలను చూసుకో అని చెప్తుంటారు.
అదేదో వాళ్లే నా పిల్లలకు ఫుడ్ పెడుతూ, ఫీజులు కడుతున్నట్లు మాట్లాడుతుంటారు. తనకు డ్రింక్ చేసే అలవాటు ఉందని, ఓసారి అర్థరాత్రి 2 గంటలకు తాగేసి ఉన్నానని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది అను డార్లింగ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com