నిందితుడ్ని పట్టిస్తే యాబై వేలు ఇస్తా : ఆర్పీ పట్నాయక్

నిందితుడ్ని పట్టిస్తే యాబై వేలు ఇస్తా : ఆర్పీ పట్నాయక్
ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన పల్లకొండ రాజును పట్టిస్తే రూ. 50,000 రివార్డు ఇస్తానని నటుడు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్

ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన పల్లకొండ రాజును పట్టిస్తే రూ. 50,000 రివార్డు ఇస్తానని నటుడు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

" చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మ శాంతించాలంటే, ఈ పల్లకొండ రాజు దొరకాలి. హైద్రాబాద్ సీటీ పోలీస్ విడుదల చేసిన ఈ ఆధారాల ద్వారా ఈ నిందితుడిని పట్టుకున్న వారికి 10 లక్షలు రివార్డ్ ప్రకటించారు....నా వంతుగా ఆ పట్టించిన వారికి 50,000 ఇస్తాను. కానీ ఇతను దొరకాలి... పోలీసులు ఇచ్చిన అన్ని క్లూస్ మనకి హెల్ప్ కావొచ్చు, కాకపోవచ్చు కానీ చేతిపై "మౌనిక' అనే పచ్చబొట్టు తప్పకుండా అతన్ని పట్టించేలా చేస్తుంది. అతను మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌కి ఈ నెరస్తుడిని పట్టుకునే పనిలో మనం కూడా సహకరిద్దాం" అని ఆర్పీ పోస్ట్ చేశారు.

కాగా నిందితుడు రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం పది బృందాలుగా రంగంలోకి దిగారు. నిందితుడిని పట్టిస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని, సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story