Banerjee : కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ.. మోహన్ బాబు అలా అనేసరికి..!

Banerjee : కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ.. మోహన్ బాబు అలా అనేసరికి..!
Banerjee : ప్రకాష్ రాజ్ సంచలన ప్రకటన చేశారు.. 'సినిమా బిడ్డలం' ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితమే ప్రకాష్ రాజ్‌ ప్రకటించారు.

Banerjee : ప్రకాష్ రాజ్ సంచలన ప్రకటన చేశారు.. 'సినిమా బిడ్డలం' ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితమే ప్రకాష్ రాజ్‌ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో విష్ణు ప్యానల్ ఇచ్చిన హామీలకు ఎక్కడ కూడా ఎదురుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు.

అటు ఇదే మీడియా సమావేశంలో మాట్లాడిన నటుడు బెనర్జీ కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరి ముందు మోహన్ బాబు అన్ని బూతులు తిడుతుంటే బాధ కలిగిందని అన్నారు. మా వాళ్లంతా అప్పడు అందరూ దూరదూరంగా ఉన్నారు. అది చూసి వాళ్లు అలా ప్రవర్తించడంతో చాలా బాధ కలిగిందని అన్నారు. విష్ణు బాగా పనిచేస్తారన్న నమ్మకం ఉంది. అలా పని చేయాలని కోరుకుంటున్నానని బెనర్జీ చెప్పుకొచ్చారు.

ఇక మోహన్ బాబు కుటుంబంతో మంచి అనుబంధం ఉందని.. మోహన్ బాబు గారి ఇంటికి వెళ్లేంత చనువు ఉందని అన్నారు. లక్ష్మి పుట్టినప్పటి నుంచి ఆమెను ఎత్తుకుని తిరిగానని, మోహన్ బాబు గారి ఇంటి మనిషిలా ఉండేవాడిని అలాంటిది ఆయన ఆరోజు ఆలా తిట్టడం షాక్ అయ్యానని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story