MAA Elections 2021 : "మా" ప్రెసిడెంట్‌ పదవికి పోటీలో సీవీఎల్‌ నరసింహరావు..!

MAA Elections 2021 : మా ప్రెసిడెంట్‌ పదవికి పోటీలో సీవీఎల్‌ నరసింహరావు..!
MAA Elections 2021: మా’ అధ్యక్ష ఎన్నికలు ర‌స‌వ‌త్తరంగా మారుతున్నాయి.

MAA Elections 2021: మా' అధ్యక్ష ఎన్నికలు ర‌స‌వ‌త్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, జీవిత రాజశేఖర్, మంచు విష్ణు, హేమ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా సీనియర్ నటుడు సీవీఎల్ నర్సింహారావు కూడా 'మా' అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. తనకు ఎలాంటి ప్యానల్ లేదని, అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారాయన. ప్రస్తుత వివాదాల వల్ల తెలుగు కళాకారులకు అన్యాయం జరుగుతుందని ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేశారు. తెలంగాణ వాదంతో ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.'మా' అసోసియేషన్ విభజన జరగాలని డిమాండ్ చేశారు. 18 మంది కార్యవర్గ సభ్యుల్లో 9 మంది తెలంగాణ కళాకారులకు అవకాశం కల్పించాలని కోరారు. సీవీఎల్ ప్రకటనతో మా అధ్యక్ష పదవికి ఇప్పటి వరకు ఐదుగురు బరిలో నిలిచిన‌ట్లైంది.

Tags

Read MoreRead Less
Next Story