వరుణ్ తేజ్ పెళ్లి.. ఆ అమ్మాయైనా ఒకే అంటున్న నాగబాబు..!

లాక్ డౌన్ టైం సమయంలో చాలా మంది నటీనటులు పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే...ఇందులో కొందరు ప్రేమ వివాహలు చేసుకుంటే మరికొందరు మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నారు. ఇక కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఖాళీగా దొరికిన సమయాన్ని మొత్తం జీవిత భాగస్వామికి కేటాయించారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలైన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లపైన పడింది. ఇప్పటికే వీరిద్దరి పెళ్లి గురించి ఇండస్ట్రీలో చాలా గాసిప్స్ వచ్చాయి.
ఇక వరుణ్ తేజ్ పెళ్లి గురించి అయితే ఆయన తండ్రి నాగబాబు ఇప్పటికే పలుమార్లు స్పందించారు కూడా.. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా వరుణ్ పెళ్లి పైన కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే నాగబాబు.. తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేశాడు. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు. 'వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'మంచి సంబంధాలు ఉంటే చూడండి' అంటూ కామెంట్ చేశాడు నాగబాబు.
'వరుణ్ ఒక మిడిల్ క్లాస్ గర్ల్ తోనే లైఫ్ అనుకొని ఆ అమ్మాయినే చేసుకుంటా.. అదే ఫిక్స్ అంటే మీరు ఏం చేస్తారు?' అని మరో నెటిజన్.. నాగబాబుని ప్రశ్నించగా.. మీకు ఓకే అయితే నేనేమంటా.. వరుణ్ ప్రేమ వివాహం చేసుకున్న అభ్యంతరం లేదని హింట్ ఇచ్చారు నాగబాబు. నాగబాబు జవాబులతో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com