నటుడు నవదీప్‌పైన ప్రశ్నల వర్షం.. 9 గంటలుగా విచారణ...!

ఎఫ్ లాంజ్ పబ్ కేంద్రంగా మనీ లాండరింగ్ జరిగిందా..? విచారణలో ఇదే తేల్చుతోంది ఈడీ.. అసలు గుట్టంతా బయటపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన ఈడీ అధికారులు నటుడు నవదీప్‌పైనా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. ఒకటి కాదు రెండు కాదు.. 9 గంటలుగా నవదీప్ విచారణ కొనసాగుతోంది.. ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్‌తో కలిపి అతన్ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.. 2017, అంతకు ముందు రెండేళ్ల కాంలో ఎఫ్ లాంజ్ పబ్ ద్వారా జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ కాలంలో పబ్‌కు వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు.. పార్టీల పేరుతో పెద్ద ఎత్తున పబ్ అకౌంట్‌లోకి నిధులు చేరినట్లుగా అనుమానిస్తున్నారు.. కొంతమంది నటీనటులు పెద్ద మొత్తంలో క్లబ్ అకౌంట్‌కు, మేనేజర్‌కు డబ్బు బదిలీ చేసినట్లుగా గుర్తించారు.. కెల్విన్, పీటర్, కమింగ్ అకౌంట్లకు ఎఫ్ లాంజ్ పబ్ నుంచి నిధుల బదలాయింపు జరిగినట్లుగా తెలుస్తోంది.. ఈ పార్టీల వ్యవహారమంతా కెల్విన్, నవదీప్ కలిసి నడిపినట్లుగా గుర్తించారు.. దీంతో ఎఫ్ లాంజ్ పబ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు దర్యాప్తులో కీలకంగా మారాయి..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com