sonu sood : అభిమానం ఇలా... కూలీ పనులు చేసిన డబ్బులతో సోనూసూద్ విగ్రహం..!

Sonu Sood : కరోనా లాంటి విపత్కరమైన సమయంలో ఎంతోమందికి హెల్ప్ చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్.. అడిగిన ప్రతీ ఒక్కరికీ కూడా సహాయసహకారాలు అందజేశాడు. ఎందరో కష్టాలను తీర్చిన సోనూసూద్ పట్ల అభిమానాన్ని చాటుకుంటూ... అతనికి అరుదైన గౌరవాన్ని అందించారు ఓ నిరుపేద కుటుంబానికి చెందిన దంపతులు.
వివరాల్లోకి వెళ్తే.. గుర్రం వెంకటేశ్వర్లు, మరియమ్మ దంపతులు బోనకల్ మండలం గార్లపాడులో నివాసం ఉంటున్నారు. కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కరోనా సమయంలో సోనూసూద్ చేస్తున్న సేవలకి ఫిదా అయ్యారు. దీంతో కూలీ పనులు చేసి కూడగట్టుకున్న రూ.25 వేలతో విజయవాడలో విగ్రహాన్ని చేయించారు. దసరా లోపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా సోనూసూద్ చేసిన సేవలకు గాను తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల సోనూసూద్ విగ్రహాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com