గ్రేట్ సోనూ.. ఆచార్య యూనిట్ కి స్మార్ట్ ఫోన్స్ గిఫ్ట్!

గ్రేట్ సోనూ.. ఆచార్య యూనిట్ కి స్మార్ట్ ఫోన్స్ గిఫ్ట్!
తన సేవలను ఆపకుండా పేదల కోసం వైద్యం, విద్య వరకూ అన్ని సహాయం చేస్తూనే వస్తున్నాడు. ఎక్కడైనా కష్టం అనే మాట వినిపించినా, కనిపించినా అక్కడ వాలిపోతున్నాడు..

లాక్ డౌన్ టైంలో వలస కూలీలకి అండగా నిలిచి వారి పాలిట దేవుడిలా నిలిచారు నటుడు సోనూసూద్.. అంతటితో తన సేవలను ఆపకుండా పేదల కోసం వైద్యం, విద్య వరకూ అన్ని సహాయం చేస్తూనే వస్తున్నాడు. ఎక్కడైనా కష్టం అనే మాట వినిపించినా, కనిపించినా అక్కడ వాలిపోతున్నాడు.. సినిమాల్లో విలన్ అయినప్పటికీ, రియల్ లైఫ్ లో సోనూ ఓ రియల్ హీరో.. తాజాగా మెగాస్టార్ ఆచార్య సెట్లోనూ కూడా తన దాన గుణం చూపించారు సోనూసూద్.

ఆచార్య సినిమా కోసం పనిచేస్తున్న వంద మందికి ఇవ్వాలా స్మార్ట్ ఫోన్స్ గిప్ట్ గా ఇచ్చాడు సోనూసూద్.. చిత్ర యూనిట్ లో చాలా మందికి స్మార్ట్ ఫోన్ కూడా కొనుక్కునే పరిస్దితి ఉందని, వారి పిల్లలు కూడా ఆన్ లైన్ క్లాస్ లకు హాజరు కాలేకపోతున్నారని తెలుసుకొని సోనూసూద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సోనూసూద్ ఈ గిఫ్ట్ ఇచ్చేవరకు ఎవ్వరికి కూడా తెలియదు. దీనితో వారంతా ఆనందంలో మునిగితేలారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


అటు ఆచార్య సినిమా విషయానికీ వచ్చేసరికి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్‌ హంగులతో పాటు సామాజిక సందేశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story