ఇద్దరితో ప్రేమాయణం.. నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

ఇద్దరితో ప్రేమాయణం.. నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

టీవీ నటి శ్రావణి సూసైడ్‌ కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఇద్దరితో ప్రేమాయణమే శ్రావణి ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవరాజ్‌, సాయిలు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. అయితే.. శనివారం పోలీసుల విచారణ కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు సాయి కృష్ణను విచారణకు పిలిచారు. శ్రావణి సూసైడ్‌కు బలమైన కారణాలేంటో విచారణలో పోలీసులు తేల్చే అవకాశం ఉంది. సాయి, దేవరాజ్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండడంతో వారిద్దరినీ పోలీసులు ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించనున్నట్లు సమాచారం.

శ్రావణి ముందుగా సాయిని ప్రేమించింది. దేవరాజ్‌తో పరిచయం జరిగాక.. తన ప్రేమను.. సాయిపై నుంచి డైవర్ట్‌ చేసింది శ్రావణి. దేవరాజ్‌తో పరిచయమైన కొద్దిరోజులే అయినప్పటికీ... అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది శ్రావణి. ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినప్పటికీ... దేవరాజ్‌నే శ్రావణి ఇష్టపడింది. దేవరాజ్‌పై స్టేషన్‌లో కేసు పెట్టినప్పటికీ.. అతడిపై ప్రేమ తగ్గలేదు. సాయికి, కుటుంబ సభ్యులకు తెలియకుండా దేవ్‌రాజ్‌ను శ్రావణి కలిసినట్టు విచారణలో తేలింది. ఇంట్లో జరిగిన గొడవల్నీ దేవరాజ్‌కు ఫోన్‌లో శ్రావణి తెలిపేది. అటు దేవరాజ్ కూడా శ్రావణి మాటలు వింటూనే వాటిని రికార్డ్ చేసేవాడు. శ్రావణి ఆత్మహత్య తర్వాత.. దేవరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ ఆడియోలు లీక్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఆడియోల్లో వాస్తవాలను కూడా పోలీసులు పరిశీలించనున్నారు.

అటు.. శ్రీకన్య రెస్టారెంట్‌లో సాయి కృష్ణ.. శ్రావణిని కొట్టడానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. దాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రావణిని కొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఆధారాలు దొరికితే సాయి కృష్ణపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 7న ఎస్సార్‌నగర్‌లోని శ్రీకన్య హోటల్‌లో శ్రావణి, దేవరాజ్‌ కలిసి భోజనం చేసిన సీసీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరాజ్‌, శ్రావణి.. ఆ ఫుటేజిలో సన్నిహితంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అదే రోజు శ్రావణిపై సాయి చేయిచేసుకున్నట్టు.. పోలీసుల విచారణలో దేవరాజ్‌ తెలిపాడు. అటు దేవరాజ్‌తో శ్రావణి చనువుగా తిరుగుతున్నట్టు.. ఆమె కుటుంబ సభ్యులకు సాయి తెలిపాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు శ్రావణితో ఈ విషయంపై మాట్లాడినట్టు సమాచారం. అదే రోజున.. అర్థరాత్రి శ్రావణి ఆత్మహత్యచేసుకుని చనిపోయింది.

శ్రావణి ఆత్మహత్య తర్వాత ఆమె తల్లి దేవరాజ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఓ వైపు దేవరాజ్‌, సాయిల పేర్లు బయటికి వచ్చాక.. RX-100 నిర్మాత అశోక్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో దేవరాజ్‌, సాయితో పాటు అశోక్ రెడ్డిని కూడా పోలీసులు విచారించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story