నా పెళ్లి ఏం సడెన్‌గా జరగలేదు.. వరంగల్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

నా పెళ్లి ఏం సడెన్‌గా జరగలేదు.. వరంగల్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు..!
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోజుల్లో చిత్రంతో వెండితెరకి పరిచయమైంది నటి ఆనంది కాయల్.. ఆ మూవీలో సెల్ సాంగ్‌లో మాత్రమే ఆమె కనిపించింది.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోజుల్లో చిత్రంతో వెండితెరకి పరిచయమైంది నటి ఆనంది కాయల్.. ఆ మూవీలో సెల్ సాంగ్‌లో మాత్రమే ఆమె కనిపించింది. ఇక ఆ తర్వాత బస్ స్టాప్ మూవీలో సీమా అనే పాత్రలో నటించి.. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆ తర్వాత ప్రియతమా నీవచట కుశలమా, నాయక్, గ్రీన్ సిగ్నల్ సినిమాలు చేసింది.


కానీ ఈ సినిమాలేమీ ఈ భామకి మంచి గుర్తింపును ఇవ్వలేకపోయాయి. దీనితో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సెటిలైపోయింది. అక్కడ ఓ 12 సినిమాలు చేసి మరో 6 సినిమాలతో బిజీగా ఉంది. అయితే కెరీర్ పరంగా మంచి బిజీగా ఉన్న సమయంలోనే సోక్రటీస్ అనే వ్యక్తిని.. ఈ ఏడాది ఆరంభంలో పెళ్లి చేసుకొని అభిమానులకి షాక్ ఇచ్చింది.


అయితే పెళ్లి అయ్యాక హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పడుతాయి అన్నదానికి ఆసక్తికరమైన సమాధానం చెప్పింది ఈ వరంగల్ బ్యూటీ.. హీరోయిన్ల సినీ జీవితంపై పెళ్లి అనేది ఎలాంటి ప్రభావం చూపదని అంటుంది. అది ఎంతమాత్రం నిజం కాదని ఆమె అభిప్రాయపడింది.


ఇక తన జీవితంలో కూడా పెళ్ళయ్యాక ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని తెలిపింది. ప్రస్తుతం ఫర్ఫామెన్స్ ఓరియెంటెడ్ మూవీలపై ఫోకస్ పెట్టినట్టుగా వెల్లడించింది. ఇక తన వివాహ జీవితం, సినీ జీవితం రెండు సమాంతరంగా సాగుతాయని నమ్ముతున్నట్లు పేర్కొంది.


ఇక తన పెళ్లి కూడా ఏం సడన్ గా అయిపోలేదని, మా రెండు కుటుంబాలకు రెండేళ్లుగా పరిచయం ఉందని తెలిపింది. ఇరు కుటుంబాల సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలని చెప్పారని.. అలాగే పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చింది.
Tags

Read MoreRead Less
Next Story