వావ్!..పోలవరంలో అందాల అనుష్క.. స్వీటీ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా

వావ్!..పోలవరంలో అందాల అనుష్క.. స్వీటీ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా

అందాల తారా అనుష్క బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో సందండి చేశారు. గోదావరి మధ్యలో ఉన్న మహా నందీశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. 'బాహుబలి' మూవీకి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసిన ప్రశాంతి త్రిపురనేని, మరో ఫ్రెండ్‌తో కలిసి అనుష్క గోదావరి నదిలో పడవ ప్రయాణం చేశారు. అనుష్క మాస్క్‌ ధరించి ఉండటంతో.. స్థానికులు త్వరగా గుర్తుపట్టలేకపోయారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. సౌత్‌ఇండియాలో నెంబర్ వన్ స్టార్‌గా ఉన్నప్పటికీ ఎటువంటి ఆడంబరం లేకుండా ఆమె వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్వీటీ సింప్లిసిటీకి మరోసారి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story