Hema Maa Elections : రాత్రి గెలిచి ఉదయాన్నే ఎలా ఓడిపోయమో దుర్గమ్మకే తెలియాలి : హేమ

Hema Maa Elections : 'మా' ఎన్నికలు అయితే ముగిశాయి కానీ వివాదాలు, ఆరోపణలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ లోని పదకొండు మంది రాజీనామా చేశారు. ఇదిలావుండగా తాజాగా మా ఎన్నికల ఫలితాల పైన సినీ నటి హేమ స్పందించింది.
ఈ రోజు ఉదయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గని దర్శించుకున్న ఆమె.. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక మా ఎన్నికల పైన మాట్లాడుతూ.. రాత్రి గెలిచామని చెప్పి.. ఉదయానికే ఎలా ఓడిపోయామో తమకి షాకింగ్ లాగా ఉందని అన్నారు. దీనికి కారణం ఏంటో దుర్గమ్మకే తెలుసునని వ్యంగ్యంగా మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో హేమ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసి అమె ఓడిపోయారు. హేమ కంటే ముందు అదే ప్యానల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అనసూయ కూడా ఫలితాల పైన ఆరోపణలు చేస్తూ వరుస ట్వీట్స్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com