Jayalalita Marriage : ఏడేళ్ళ ప్రేమ... ఆర్నెళ్లకే నిజస్వరూపం.. ఏడాదే కాపురం... !

Jayalalita Marriage : అందం, అభినయం ఉన్న ఇండస్ట్రీలో కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మిగిలిపోయారు నటి జయలలిత.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో దాదాపుగా 700కి పైగా చిత్రాలలో నటించిన ఆమె.. ఎక్కువగా వ్యాంప్ పాత్రలతో ఫేమస్ అయ్యారు.. కమల్ హాసన్ సరసన 'ఇంద్రుడు చంద్రుడు' చిత్రంలో కనిపించారు జయలలిత.. ఇప్పుడు ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు కానీ సీరియల్స్‌లో నటిస్తూ బులితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలావుండగా తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
జయలలిత మలయాళంలో వ్యాంప్ పాత్రలతోనే పరిచయం అయ్యారు. అక్కడ ఆమెకి దర్శకుడు వినోద్‌తో పరిచయమైంది.. ఆయన భక్తితో పాటుగా డీగ్రేడ్ సినిమాలు కూడా చేసేవారు.. ఆ డీగ్రేడ్ సినిమాలన్నింటిలో జయలలిత హీరోయిన్‌గా నటించారు. అలా ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా ఏడేళ్ళు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వినోద్ కంగారు పెట్టడంతో అతన్ని పెళ్లి చేసుకుంది అమె... అయితే వినోద్ నిజస్వరూపం ఏడాదికే బయటపడిందని, కేవలం అతనికి ఉన్న అప్పులు, తన ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత చిత్రహింసలు పెట్టాడని వెల్లడించింది.
ప్రస్తుతం తన జీవితం హాయిగా ఉందని, సినిమాలున్నా లేకున్నా ప్రశాంతంగానే ఉన్నానని చెప్పుకొచ్చింది జయలలిత. చివరిగా ఆమె మహేష్ బాబు భరత్ అను నేను అనే చిత్రంలో స్పీకర్ పాత్రలో నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com