షాకింగ్ లుక్‌లో జయసుధ.. వైరల్ గా మారిన ఫోటో..!

సిల్వర్ స్క్రీన్ పైన సహజనటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకున్నారు నటి జయసుధ.. పద్నాగేళ్ల వయసులో స్క్రీన్ పైన కనిపించిన జయసుధ.. తన 45 ఏళ్ల సినీ కెరీర్ లో... హీరోయిన్ గా, అమ్మగా, వదినగా చాలా రకాల పాత్రలు పోషించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి', బాలకృష్ణ 'రూలర్' చిత్రాల తర్వాత ఆమె స్క్రీన్ పైన కనిపించడం లేదు.
అయితే చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా అభిమానుల ముందుకు వచ్చారు. ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం కానున్న సీరియల్ 'జానకి కలగనలేదు' బృందానికి విషెస్ చెప్పారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. శోభన్ బాబు, తాను కలిసి నటించిన 'జానకి కలగనలేదు.. రాముడి సతి కాగలనని ఏనాడు' అనే పాటను గుర్తుచేసుకున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాట చాలా మందిని ఆకట్టుకుందని అన్నారు.
ప్రస్తుతం ఆ పాట పేరుతో సీరియల్ రావడం తనకి ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.. ఈ సీరియల్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయితే చాలా రోజుల తరవాత అభిమానులకి కనిపించిన జయసుధ నెరిసిన జుట్టుతో కనిపించడం అభిమానులను షాక్ కి గురిచేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com