Keerthy Suresh: టీకా తీసుకున్న మహానటి..!

X
By - TV5 Digital Team |23 May 2021 9:45 PM IST
Keerthy Suresh : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య వేలల్లో సంభవిస్తున్నాయి.
Keerthy Suresh : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య వేలల్లో సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా టీకా వేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే హీరోయిన్ కీర్తి సురేష్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపింది. కాగా ఈ ఏడాది రంగ్ దే చిత్రంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారీ వారి పాట అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com