విజయ్ దేవరకొండతో ఆ సినిమా నేనే చేయాల్సింది కానీ..!

బాలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ కూడా సినిమాలు దక్కించుకుంటూ ఫుల్ బిజీ అవుతుంది అందాల భామ కియారా అడ్వాణీ
1992 జులై 31న ముంబయిలో జన్మించిన ఈ బ్యూటీ లీవుడ్ ఐకాన్ అశోక్‌కుమార్ ముని మనవరాలు. ఈమె అసలు పేరు ఆలియా
బాలీవుడ్ లో 2014లో వచ్చి 'ఫగ్లీ' చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైంది.
ధోని బయోపిక్ లో సాక్షి పాత్ర పోషించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
'భరత్ అనే నేను' అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ పాత్ర కోసం కీయరాను కొరటాలకి నమ్రత రిఫర్ చేశారు
శంకర్-రామ్‌చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది.
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రను ముందుగా కీయరాకే అవకాశం వచ్చింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయింది.
బాలీవుడ్ రీమేక్ 'కబీర్ సింగ్'లో మళ్లీ ఆ అవకాశం రావడంతో అదే పాత్రలో నటించింది.
21వ శతాబ్దంలో లిప్ లాక్ సన్నివేశాలు సహజమేనని అంటుంది కీయరా.. పాత సినిమాల్లో ముద్దు సన్నివేశాలు వచ్చినప్పుడు పువ్వులు అడ్డం పెట్టి చూపిస్తే, ప్రేక్షకులు నవ్వుతారని, మనం రియల్‌గా ఉండాలని అంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com