Madhu Shalini: సీక్రెట్‌గా ఆర్‌జీవీ హీరోయిన్ పెళ్లి.. తమిళ నటుడితో..

Madhu Shalini: సీక్రెట్‌గా ఆర్‌జీవీ హీరోయిన్ పెళ్లి.. తమిళ నటుడితో..
X
Madhu Shalini: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌కి వచ్చి ‘కితకితలు’ చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వచ్చింది మధు శాలిని.

Madhu Shalini: ఈమధ్యకాలంలో చాలావరకు నటీనటులు ఏ హంగు ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. అందుకే ఫోటోలు కూడా ఎక్కువగా బయటికి రానివ్వడం లేదు. అంతే కాకుండా కొందరు నటీనటులు పెళ్లి చేసుకున్నామని వారు ప్రకటించేవరకు బయట ప్రపంచానికి తెలియడం లేదు. తాజాగా ఓ తెలుగు నటి పెళ్లి కూడా అలాగే జరిగిపోయింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌కి వచ్చి 'కితకితలు' అనే చిత్రంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన హీరోయిన్ మధు శాలిని. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా, అప్పుడప్పుడు గెస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను పలకరించేది. ఇక కొన్నాళ్ల తర్వాత మధు శాలిని.. కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ కంటపడింది. తన డైరెక్షన్‌లో కూడా మధు శాలిని పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కొన్నాళ్లుగా సినిమా అవకాశాలు రాక సైలెంట్‌గా ఉన్న మధు.. ఇటీవల వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టింది.

ఇప్పుడిప్పుడే వెబ్ వరల్డ్‌లో నటిగా అవకాశాలు అందుకుంటున్న మధు శాలిని.. ఓ తమిళ నటుడిని పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చింది. తమిళంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన గోకుల్‌ ఆనంద్‌ను మధు పెళ్లి చేసుకుంది. పలు పెళ్లి ఫోటోలతో పాటు మధు శాలిని పెట్టిన ట్విటర్ పోస్ట్ కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.




Tags

Next Story